విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు.
అమరావతి: దేవుడితో చెలగాటమాడితే ఆ దేవుడే తప్పకుండా శిక్షిస్తాడని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇలాంటి చర్యలపట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని... మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలుండాలని సీఎం ఆదేశించారు.
తన కార్యాలయ అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అర్హత ఉండి కూడా ఇంటిపట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని... పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వారికి వెంటనే పట్టాలు ఇప్పించాలని ఆదేశించారు. అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం తమది కాదని... మనం పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నామన్నారు. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
read more జగన్ శ్రీవారి సందర్శన వివాదం: డిక్లరేషన్ మీద హైకోర్టు కీలక తీర్పు
''పెన్షన్, బియ్యంకార్డు, ఇంటి పట్టాకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులో దరఖాస్తులు లేకుండా చూసుకోవాలి. అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లక్ష్యాలను ఖచ్చితంగా అందుకుంటూ ముందుకు సాగాలి'' అని సూచించారు.
''ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించాలి. ఇన్ని రోజుల్లో ఈ సేవలు అందిస్తామన్న విషయాన్ని తెలిపేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా? లేవా?అనేది మరోసారి పరిశీలన చేయండి. అమ్మ ఒడి పథకానికి అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలి'' అని సీఎం ఆదేశించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 31, 2020, 12:21 PM IST