విశాఖపట్టణం: ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో అస్వస్థతకు గురైన  బాధితులను సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు  మధ్యాహ్నం పరామర్శించారు.

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గురువారం నాడు తెల్లవారుజామున గ్యాస్ లీకైంది. ఈ గ్యాస్ లీకైన ఘటనలో 10 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

also read:నిర్లక్ష్యం లేదని కంపెనీ నిరూపించుకోవాలి: విశాఖ ప్రమాదంపై మంత్రి గౌతం రెడ్డి

ఈ విషయమై అమరావతిలో  అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశం తర్వాత జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖకు చేరుకొన్నారు. విశాఖలో కేజీహెచ్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  బాధితులను పరామర్శించారు.

ప్రమాదం జరిగిన తీరును ఆయన బాధితులను అడిగి తెలుసుకొన్నారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి సీఎం ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని గురించి సీఎం వైద్యులను వాకబు చేశారు.బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.