దసరాలోపు పెండింగ్ డీఏ విడుదల: ఏపీఎన్‌జీఓ మహాసభల్లో చంద్రబాబుపై ఫైర్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏను ఈ ఏడాది దసరా లోపుగా అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
విజయవాడ: పెండింగ్ లో ఉన్న రెండు డీఏలలో ఒక్క డీఏను ఈ ఏడాది దసరా లోపుగా అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.ఏపీ ఎన్‌జీఓ మహాసభలు ఇవాళ విజయవాడ మున్సిఫల్ స్టేడియంలో జరిగాయి.ఈ మహాసభల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఏపీఎన్‌జీఓ నేత శ్రీనివాసరావు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. రెండు డీఏల్లో ఒక్క డీఏను విడుదల చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ఉద్యోగుల గురించి చంద్రబాబుకు దారుణమైన అభిప్రాయాలున్నాయన్నారు. చంద్రబాబు రాసిన మనసులో మాట పుస్తకంలోని కొన్ని అంశాలను సీఎం జగన్ చదివి విన్పించారు. ఉద్యోగుల్లో ఏ వర్గాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు హయంలో ఆర్టీసీ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆనాడు ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉన్నాయో, ఇవాళ ఎలా ఉన్నాయో ఆలోచించాలని సీఎం జగన్ కోరారు. ఉద్యోగులకు చంద్రబాబు మంచి చేస్తాడా ఆలోచించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులను కోరారు.
also read:రెండు రోజుల్లో జీపీఎస్ పెన్షన్ పై ఆర్డినెన్స్: ఏపీ ఎన్‌జీఓ మహాసభల్లో జగన్
జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని చంద్రబాబు సర్కార్ పై జగన్ మండిపడ్డారు. శాశ్వత ఉద్యోగుల నియామకాన్ని చంద్రబాబు తగ్గించారన్నారు.ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 54 ప్రభుత్వరంగ సంస్థలను చంద్రబాబు మూసివేశారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు రాసిన మనసులోని మాట పుస్తకాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి చదువుకోవాలని ఆయన సూచించారు.