ఇటువంటి పరిస్ధితుల్లో మీడియా ముందు రావాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమీషన్ వాయిదా వేయడంతో ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్ధితి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలు చింతించాల్సి వస్తుందన్నారు.

చంద్రబాబు నాయుడు దగ్గరుండి వ్యవస్థలను నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టిందన్న ముఖ్యమంత్రి వ్యాధి సోకిని వారిలో 65 వేలమందికి నయం అయ్యిందన్నారు.

Also Read:గవర్నర్ కు ఈసీపై ఫిర్యాదు: 'స్థానిక' వాయిదాపై జగన్ తీవ్ర ఆసంతృప్తి

ఆ వైరస్ చైనాలో ప్రారంభమై.. ఇతర దేశాలకు పాకుతోందని, ఇది అంత భయానకమైనది కాదన్నారు. కరోనా వైరస్ కేవలం 60 ఏళ్ల పైబడిన వారు వీరిలోనూ అస్తమా, కిడ్నీ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే ఇది ప్రమాదకరంగా మారుతోందని సీఎం చెప్పారు.

న్యూమోనియా, టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటామో కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

పారాసిటమాల్ మాత్ర వేస్తే సరిపోతుందని, పాజిటివ్ కేసుల్లో 80.9 శాతం ఇంట్లోనూ ఉంటూ నయమైందని, కేవలం 13.8 శాతం మంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యారని సీఎం తెలిపారు. కేవలం 4.7 కేసులు ఐసీయూల వరకు వెళ్లాయని, ఇంత ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదన్నారు.

Also Read:కొడాలి నాని భాషలో బీహార్ అమ్మ మొగుడిలా ఏపీ: దీపక్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అడుగులు ముందుకు వస్తున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తారని.. వారిని విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేసి అవసరమైతే ఐసోలేషన్‌కు తరలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.