అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన దాదాపు గంటపాటు గవర్నర్ తో చర్చించారు. ఆ వివరాలు ఏమిటనేది తెలియడదం లేదు గానీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపైనే మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. 

కరోనా ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేశారని జగన్ విశ్వసించడం లేదని అంటున్నారు. మాచర్ల ఘటన, నామినేషన్లను అడ్డుకోవడం, తదితర ఘటనల నేపథ్యంలోనే ఎన్నికలువాయిదా పడినట్లు పలువురు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదే విషయం మాట్లాడుతున్నారు. కరోనా ప్రభావంతో ఎన్నకలు వాయిదా పడ్డాయని తాము అనుకోవడం లేదని, కేంద్రం చర్యల్లో భాగంగానే వాయిదా పడ్డాయని వారంటున్నారు. 

Also Read: కొడాలి నాని భాషలో బీహార్ అమ్మ మొగుడిలా ఏపీ: దీపక్ రెడ్డి

ఎన్నికలు వాయిదా పడితే జగన్ కు అదనపు చిక్కు ఎదురు కానుంది. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావని ప్రభుత్వం చెబుతోంది. గవర్నర్ తో భేటీకి ముందు జగన్ మంత్రి ఆళ్ల నాని, వైద్యాధికారులతో ఆయన కోరానపై చర్చలు జరిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా జగన్ గవర్నర్ కు వివరించి ఉంటారని భావిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీరుపై జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. 

కరోనా ప్రభావం కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. 

Also Read: బీజేపీ అభ్యర్ధులకు ఏం కానివ్వను, ఏమైనా జరిగితే రాజీనామా : ఆదినారాయణ రెడ్డి

ఏకగ్రీవాలు అలాగే ఉంటాయని, నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, తదుపరి ప్రక్రియకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అయితే, ఎన్నికల ప్రక్రియను పూర్తి రద్దు చేయాలని టీడీపీ, జనసేన, బిజెపి డిమాండ్ చేస్తున్నాయి.