ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ దసరా కానుక .. రేపు కీలక ఉత్తర్వులు

ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.  సీఎం ఆదేశాలతో 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. 

ap cm ys jagan orders to grant da for state government employees ksp

ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. ఇకపోతే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఆయన సంతకంతో గెజిట్ నోటిఫికేష్ విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా జీపీఎస్ చట్టానికి సభ ఆమోదం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనుంది ప్రభుత్వం. 

మరోవైపు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో బిల్లును గెజిట్ నోటిఫికేషన్ రూపంలో ప్రచురించారు. ప్రభుత్వ నిర్ణయంతో పలు శాఖల్లో పనిచేస్తున్న 10,117 మంది  కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios