విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారికి ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు  పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ పద్దతిలో ఆయన పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. పంచెకట్టుతో ఆయన ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొన్నారు.

దసరా పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయం.  ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది.

also read:జగన్ రాకకు ముందు కలవరం: విరిగి పడిన ఇంద్రకీలాద్రి కొండచరియలు

జగన్ దేవాలయానికి రావడానికి కొద్దిసేపటికి ముందే ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.. దీంతో సీఎం జగన్  సాయంత్రం ఐదు గంటలకు ఆలయానికి వచ్చారు.

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని అధికారులు సీఎంకు చూపించారు. ఘాట్ రోడ్డు మీదుగానే జగన్ ఈ ప్రాంతానికి చేరుకొన్నారు. కొండచరియలు విరిగి పడిన ఘటన గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకొన్నారు.ఘాటు రోడ్డుపై కొండ చరియలను క్లియర్ చేసిన తర్వాతే సీఎం ఇక్కడికి చేరుకొన్నారు.

సీఎంకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు , ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
ఆలయంలో  సీఎంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలను సమర్పించారు.

మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఇవాళ అమ్మవారు సరస్వతీదేవీ అలంకారంలో దర్శనమిచ్చారు.