కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. గంటపాటు పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు.

ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేపు ఉదయం నేరుగా తిరుపతి చేరుకుంటారు జగన్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు ముఖ్యమంత్రి.

రాత్రి తిరుమలలోనే బస చేసి గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిరసన తెలపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు శ్రేణులకు పిలుపునిచ్చారు.