ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం నాడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్ధిక పరిస్థితులపై జగన్ ప్రధానికి వివరించనున్నారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jagan ప్రధానమంత్రి Narendra Modi తో మంగళవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించనున్నారు.

ఇవాళ గన్నవరం ఎయిర్ పోర్టు నుండి New Delhi కి వచ్చిన సీఎం జగన్ కు ఎయిర్ పోర్టులో YCP ఎంపీలు స్వాగతం పలికారు. 
ఎయిర్‌పోర్టులో సీఎంకు ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మార్గాని భ‌ర‌త్‌, వంగా గీత‌, మాధ‌వి, అయోధ్య‌ రామిరెడ్డి, గురుమూర్తి, మాధ‌వ్‌, రంగ‌య్య‌, రెడ్డ‌ప్ప‌, స‌త్య‌వ‌తి, కోట‌గిరి శ్రీ‌ధ‌ర్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ స్వాగతం పలికారు. 

Polavaramప్రాజెక్ట్ సవరించిన అంచనాల ఆమోదంపై ప్రధానితో చర్చించనున్నారు. Andhra Pradeshకి ఆర్ధిక చేయూతతో పాటు ఏపీ విభజన చట్టంలోని అంశాలపై కూడా ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించనున్నారు. 

 రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ గ్యాప్ విడుదల అంశాన్ని ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లనున్నారు. కొత్త జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే రాష్ట్రంలో కొత్త జిల్లాలు 13 అమల్లోకి వచ్చినందున ఆ జిల్లాలకు కూడా కేంద్ర పథకాలకు నిధులు ఇవ్వాలని కూడా సీఎం జగన్ కోరనున్నారు.ఇవాళ మోడీతో భేటీలో ప్రధానంగా నాలుగు అంశాలపై జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి 3న మోడీతో భేటీ అయిన సీఎం జగన్ ఏడు అంశాలను ప్రస్తావించారు. 

రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి సహకరించాలని సీఎం జగన్ ప్రధానిని కోరనున్నారు. మరో వైపు రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులతో పాటు రెవిన్యూ గ్యాప్ ను పూడ్చాలని కూడా కేంద్రాన్ని సీఎం జగన్ కోరనున్నారు. 

 పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు సంబంధించి రూ. 55 వేల కోట్లకు మాత్రం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ విషయమై ఆమోదం తెలపాలని ప్రధానిని జగన్ కోరుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 మరో వైపు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఇంకా అపరిషృతంగానే ఉన్నాయి.ఈ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానిని జగన్ కోరే అవకాశం ఉంది. గతంలో కూడా ఈ విషయమై కేంద్ర హోంశాఖ అధికారులు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యుత్ సంస్థల నుండి కూడా ఏపీకి బకాయిలు రావాల్సి ఉంది.ఈ విషయమై తమకు న్యాయం జరిగేలా చూడాలని కూడా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్ కోరనున్నారు. సీఎం జగన్ ప్రధానితో భేటీ అయిన తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో కూడా భేటీ కానున్నారు.