ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు తాత్కాలిక సహాయం కింద తక్షణమే రూ.12,911 కోట్లు విడుదల చేయాలని మోడీని సీఎం కోరినట్లుగా సమాచారం. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌కు తాత్కాలిక సహాయం కింద తక్షణమే రూ.12,911 కోట్లు విడుదల చేయాలని మోడీని సీఎం కోరారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్.. దాదాపు 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదలపై జగన్ కేంద్ర హోంమంత్రితో చర్చించినట్లుగా తెలుస్తోంది.