ఢిల్లీకి ఏపీ సీఎం జగన్: మోడీ, అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 12న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
అమరావతి: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 12వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోడీతో పాటు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను సీఎం జగన్ కలవనున్నారు.
ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఏపీ సీఎం జగన్ విజయవాడ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 12వ తేదీ రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ నెల 13వ తేదీ ఉదయం ప్రధానమంత్రి మోడీతో సీఎం భేటీ కానున్నారు.
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపుతో పాటు ఏపీ శాసనమండలి రద్దు అంశం విషయమై కూడ ప్రధానమంత్రితో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
ఏపీ రాష్ట్రంలో శాసనమండలి వ్యవహరం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.