రేపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్: ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ సాయంత్రం జగన్ ఢిల్లీకి బయలుదేరినా సాంకేతిక లోపంతో ఫ్లైట్ తిరిగి గన్నవరం చేరకున్న విషయం తెలిసిందే.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి జగన్ బయలుదేరారు. అయితే సీఎం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో పైలెట్ విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. గన్నవరం నుండి సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవాళ రాత్రికి ఢిల్లీకి బయలు దేరాలని జగన్ నిర్ణయించుకున్నారు. మరో విమానం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. హైద్రాబాద్ నుండి గన్నవరానికి ఇవాళ రాత్రి మరో విమానం వచ్చింది.ఈ విమానంలో సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరారు. సీఎంంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు కూడా ఉన్నారు.
also read:ఫ్లైట్ లో సాంకేతిక సమస్య: అధికారులపై సీఎం జగన్ సీరియస్
రేపు ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరగనుంది.ఈ సమావేశంలో పలు దేశాల రాయబారులు, ప్రతినిధులు పాల్గొంటారు.ఈ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఏపీ రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో విపక్షాల విమర్శలకు అధికార పార్టీ చెక్ పెట్టనుంది.