ఫ్లైట్ లో సాంకేతిక సమస్య: అధికారులపై సీఎం జగన్ సీరియస్
విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయమై అధికారులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం కండీషన్ గురించి పట్టించుకోలేదా అని ప్రశ్నించారు.
అమరావతి: విమానంలో సాంకేతిక సమస్యపై ఏపీ సీఎం జగన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. విమానం కండిషన్ గురించి ఎందుకు వాకబు చేయలేదని సీఎం అధికారులను ప్రశ్నించారని తెలుస్తుంది. రేపు ఢిల్లీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొనాల్సి ఉంది.ఈ సమావేశంలో పాల్గొనేందుక ు జగన్ ఇవాళ సాయంత్రం 5:03 గంటలకు ఢిల్లీకి బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించాడు. వెంటనే విమానాన్ని అత్యవసరంగా గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు పైలెట్, విమానంలో ఏసీ వాల్వ్ లీక్ అయినట్టుగా పైలెట్ గుర్తించారు. దీని కారణంగానే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
also read:ఇవాళ రాత్రే ఢిల్లీకి జగన్: 9 గంటలకు ప్రత్యేక విమానంలో హస్తినకు సీఎం
విమానం అత్యవసర ల్యాండింగ్ ఘటనపై సీఎం జగన్ సీఎంఓ, జీఏడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. విమానం అత్యవసరంగా ల్యాండ్ కాగానే గన్నవరం ఎయిర్ పోర్టు నుండి జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరకున్నారు. ఇవాళ రాత్రి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు మరో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.పలు దేశాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఈ సమవేశంలో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. పలు దేశాల రాయబారులు, ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించనుంది.