అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంగళవారంనాడు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరారు. నిర్ణీత షెడ్యూల్ కంటే రెండు గంటలు ముందుగానే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ కానున్నారు.  రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉంటారు.

also read:రేపు ఢిల్లీకి జగన్: అమిత్‌షాత్ పాటు పలువురు మంత్రులతో భేటీ

ఢిల్లీ నుండి నేరుగా ఈ నెల 23వ తేదీన ఆయన తిరుమలకు చేరుకొంటారు.  మంగళవారం నాడు ఉదయం సీఎం జగన్ ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం నాడు సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా ఆయన తిరుమలకు చేరుకొని వెంకన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయమై సీఎం చర్చించనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.