ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రేపు మధ్యాహ్నం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయి.. ఏపీ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, పోలవరం, విభజన హామీల గురించి చర్చిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయల్దేరారు. రాత్రి 8.30 గంటలకు రాజధానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి ..అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి వెళతారు. రేపు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయి.. ఏపీ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, పోలవరం, విభజన హామీల గురించి చర్చిస్తారు.
అంతకుముందు.. మంగళవారం మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థెరీసమ్మ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామను కన్నుమూశారు. ఆదిమూలపు సురేష్ తల్లి థెరిసమ్మ భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మంత్రి నివాసానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ALso REad : పెన్షన్లు తొలగిస్తారని తప్పుడు ప్రచారం: రూ. 590 కోట్లను విడుదల చేసిన జగన్
ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం జగన్ ఎర్రగొండపాలెంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ నివాసానికి చేరుకున్నారు. ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్.. థెరీసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ తిరుగుపయనమయ్యారు.
ఇక, థెరీసమ్మ.. టీచర్‌గా పనిచేశారు. ఎందరినో ఉన్నత విద్యావంతులుగా ఆమె తీర్చిదిద్దారు. ఆమె తన భర్త డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జి విద్యాసంస్థలకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో విద్యాభివృద్దిగా ఎంతగానో కృషిచేశారు.
