పెన్షన్లు తొలగిస్తారని తప్పుడు ప్రచారం: రూ. 590 కోట్లను విడుదల చేసిన జగన్
పెన్షన్లను తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అర్హులకే ప్రభుత్వ పథకాలు అందించాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు.
అమరావతి: పెన్షన్లను తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అర్హులకు పెన్షన్లు అందించాలనే ఉద్దేశ్యంతోనే కొందరికి నోటీసులు జారీ చేసినట్టుగా జగన్ తెలిపారు.అర్హులైన లబ్దిదారులకు ఏదైనా కారణంతో ప్రభుత్వ పథకాలు అందని వారికి మంగళవారంనాడు నిధులు విడుదల చేశారు సీఎం జగన్. రాష్ట్రంలోని 2,79,065 మందికి రూ. 590.91 కోట్ల నిధులను సీఎం జగన్ మంగళవారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా లబ్దిదారులతో జగన్ మాట్లాడారు.
నోటీసులు ఇస్తేనే పెన్షన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.ప్రభుత్వానికి అందిన సమాచారం ఆధారంగా కొందరికి నోటీసులు జారీ చేసినట్టుగా సీఎం జగన్ చెప్పారు. ఈ నోటీసులు అందిన లబ్దిదారుల నుండి సమాధానం తీసుకుంటామన్నారు. ఈ సమాధానం తర్వాత రీ సర్వే చేసిన తర్వాతే చర్యలు తీసుకొంటామని సీఎం జగన్ తేల్చి చెప్పారు. అర్హులందరికి పెన్షన్లు అందించాలనేది తమ ప్రభుత్వం ఉద్దేశ్యమన్నారు. పెన్షన్ ఒక్కటే కాదు ప్రభుత్వ పథకాలన్నింటిని కూడా అర్హులకు అందిస్తామన్నారు. అనర్హులకు పథకాలు దక్కకూడదనేది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం జగన్ తెలిపారు.
also read:సర్వే పూర్తైన గ్రామాల్లో లబ్దిదారులకు భూ హక్కుపత్రాలు:సీఎం జగన్
గత ప్రభుత్వ హయంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయని సీఎం జగన్ ఆరోపించారు. ఏ పథకం రావాలన్న జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిందేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్టుగా సీఎం జగన్ చెప్పారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను జమ చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడంలో లంచాలు లేవు, సిఫారసులు లేవన్నారు.
ఏదైనా కారణంతో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో మళ్లీ ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ సూచనతో ధరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వివరాలపై సర్వే నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించనున్నారు.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందని రెండు లక్షల 70వేల మందికి పలు ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారులుగా గుర్తించింది ప్రభుత్వం. రూ. 590 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్.