తిరుపతి, తిరుమలలో పలు కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు పాల్గొన్నారు.  తిరుపతిలోని శ్రీపద్మావతి పిల్లల కార్డియాక్ సెంటర్ ను ప్రారంభించారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమల వచ్చిన సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇవాళ మధ్యాహ్నం గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొన్నారు. రేణిగుంట నుండి తిరుపతికి చేరుకొన్నారు.అలిపిరి వద్ద శ్రీవారి పాదాల వద్ద తిరుమలకు నడక మార్గం పై కప్పును గో మందిరాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

also read:తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

అనంతరం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 

స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం కర్ణాటక సీఎంతో కలిసి ఏపీ సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.