ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత హిందువు కాదు క్రిస్టియన్ అని, ఆమె క్రైస్తవురాలయినప్పటికీ... ఎస్సి రిజర్వేషన్ స్థానమైన ప్రత్తిపాడు నుండి పోటీ చేసి గెలిచిందని రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే ఒక ఎన్జీఓ. 

వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత హిందువు కాదు క్రైస్తవురాలు అంటూ  లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే ఒక ఎన్జీఓ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. ఆమె క్రిస్టియానిటీలోకి మారినప్పటికీ.... ఆమె హిందువుల్లోని ఎస్సిలకు మాత్రమే వర్తించే రేజర్వేషన్లను వాడుకున్నారని వారు ఆరోపిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసారు.  

ఎవరైనా దళితులు మతం మార్చుకుంటే చట్టప్రకారంగా వారికి సంక్రమించే రేజర్వేషన్లను కోల్పోతారు. దీని ప్రకారంగా చూస్తే ఆమె రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అనర్హురాలు.  

ఇప్పటికే జగన్ పైన అన్యమతస్థుడనే కార్డును బలంగా వాడుతున్న బీజేపీ ఈ కొత్త విషయాన్ని కూడా అందిపుచ్చుకున్నా అశ్చర్యం లేదు..మేకతోటి సుచరిత శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి తన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ప్రత్యర్థులు రంగంలోకి దిగే అవకాశం ఉంది.

గతంలో ఎమ్మెల్యే  కూడా ఇదే  నెలకొన్న విషయం తెలిసిందే. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కుల చిచ్చు రాజేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

ఉండవల్లి శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ ఆమెను దళిత మహిళగా చూపి రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు శ్రీదేవికి కట్టబెట్టి అన్యాయం చేసింది వైసీపీ కాదా అని ఎస్సీలే నిలదీశారని చంద్రబాబు గుర్తు చేశారు.