రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్‌ 1లో 100కు పైగా పోస్టులు, గ్రూప్‌ 2లో 900కు పైగా పోస్టులు వున్నట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో 1000 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం వుంది. గ్రూప్‌ 1లో 100కు పైగా పోస్టులు, గ్రూప్‌ 2లో 900కు పైగా పోస్టులు వున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.