గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో 1.67 లక్షల మంది పనిచేస్తుండగా.. ఆ శాఖలో మూడేళ్లుగా బదిలీలు లేవు.
పరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఈ విషయం తెలియజేశారు. జూన్ 10 వరకు సచివాయ ఉద్యోగుల బదిలీలు జరిగే అవకాశం వుందని ఆయన చెప్పారు.
రెండేళ్లు పూర్తయి, ప్రొబేషన్ డిక్లేర్ అయిన వారు బదిలీలకు అర్హులని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం వుందని.. స్పౌస్, మ్యూచువల్ బదిలీలకు వెసులుబాటు వుందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కాగా.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో 1.67 లక్షల మంది పనిచేస్తుండగా.. ఆ శాఖలో మూడేళ్లుగా బదిలీలు లేవు. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
