Asianet News TeluguAsianet News Telugu

మర్రి రాజశేఖర్ కు జగన్ మొండిచేయి: ఎమ్మెల్సీగా పెనుమత్స తనయుడు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా దివంగత వైసీపీ అధినేత పెనుమత్స సాంబశివరావరాజు కుమారుడు డాక్టర్ సురేశ్‌ను ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ap cm ys jagan finalized Dr suresh for the post of mlc
Author
Amaravathi, First Published Aug 11, 2020, 7:14 PM IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా దివంగత వైసీపీ అధినేత పెనుమత్స సాంబశివరావరాజు కుమారుడు డాక్టర్ సురేశ్‌ను ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

తొలుత ఈ టికెట్‌ను మర్రి రాజశేఖర్‌కు ఇవ్వాలని జగన్ భావించారు. అయితే సాంబశివరాజు మరణంతో చివరి నిమిషంలో పేరు మార్చారు ముఖ్యమంత్రి. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది.

పెనుమత్స సాంబశివరాజు సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బొత్సకు ఆయన రాజకీయ గురువు.

Also Read:వైసీపీ సీనియర్ నేత, బొత్స గురువు సాంబశివరాజు కన్నుమూత

సాంబశివరాజు రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1989-94 మధ్య ఆయన మంత్రిగా పనిచేశారు. 1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

గజపతినగరం, సితవాడ శాసనసభా స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలచారు. అయితే, 1994లో పరాజయం పాలయ్యారు. సుదీర్ఘ కాలం ఆయన కాంగ్రెసు పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.

Follow Us:
Download App:
  • android
  • ios