కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మామీలను మూడు నెలల్లోనే అమలు చేసిన ఏకైక సీఎం వైయస్ జగన్ అని కొనియాడారు. 

దేశంలోవై డైనమిక్ లీడర్ గా సీఎం జగన్ పేర్గాంచారాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దశల వారిగా అమలు చేస్తున్న మద్యపాన నిషేధం అభినందనీయమని ఎమ్మెల్సీ చల్లా కొనియాడారు. మద్యపాన నిషేధం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడగలిగారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయానికి కేవలం ఏడు గంటలు ఉచిత కరెంటు ఇస్తే, సీఎం జగన్‌ మాత్రం పగటిపూటే తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యతను తగ్గించేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. 

వైఎస్‌ జగన్‌ తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఒక బాధ్యతగా గుర్తించి సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానని చల్లా రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో తనను భాగం చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.