ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలతో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరె రెడ్డిని ఫాలో అవుతూనే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ప్రాంతీయ డెవలప్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లుగా  తెలుస్తోంది.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ప్రభుత్వం 3 ప్రాంతీయ డెవలప్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ఈ నెల 14న ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ పాల్గొంటారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం హాజరవుతారు.