ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పులివెందుల నుంచి విజయవాడ తిరిగి వచ్చిన ఆయన.. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు.

ఈ క్రమంలో గూడవల్లి- నిడమానురు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న ముఖ్యమంత్రి జగన్ పరిస్ధితిని అర్థం చేసుకుని అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

ఉయ్యూరు నుంచి గన్నవరం వైపు వెళ్తున్న శేఖర్ అనే వ్యక్తి ఉషా రామ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో బాధితుడిని నేషనల్ హైవేస్ అంబులెన్స్ ద్వారా విజయవాడలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదే సమయంలో దీనికి ముందు ఉన్న సీఎం కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. 

 

"