విజయవాడ: విజయవాడలో బాపు మ్యూజియాన్ని గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

పదేళ్ల క్రితం ఈ మ్యూజియం మూతపడింది. దీంతో ఈ మ్యూజియం పునరుద్దరించాలని నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం ఈ మ్యూజియాన్ని రూ. 8 కోట్లతో పునరుద్దరించారు. ఇందులో 80 శాతం కేంద్ర ప్రభుత్వం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించింది.

పర్యాటకులకు ఇవాళ్టి నుండి బాపు మ్యూజియం అందుబాటులోకి రానుంది.ఈ మ్యూజియంలో 1500 10 లక్షల ఏళ్ల నుండి 19 శతాబ్దానికి చెందిన కళాఖండాలున్నాయి. బాపు మ్యూజియం భవనాన్ని 1962లో ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది.  ఈ మ్యూజియం ఉన్న భవనాన్ని 1887లో నిర్మించారు. దీన్ని విక్టోరియా మెమోరియల్ భవనంగా పిలుస్తారు.

1921లో ఎఐసీసీ సమావేశంలో పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని మహాత్మాగాంధీకి ఇదే ప్రదేశంలో సమర్పించినట్టుగా చెప్పారు.ఇదే జెండాను 1947 జూలై 22 లో జాతీయ జెండాగా స్వీకరించారు. ఈ చారిత్రక ప్రదేశాన్ని అభివృద్ది చేశారు.