ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈ రోజు విద్యా దీవెన కింద రూ. 709 కోట్ల నిధులను విడుదల చేశారు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి జగనన్న విద్యా దీవెన కింద ఈ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మీట నొక్కి బదిలీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. పేదరికం చదవుకు అడ్డురాకూడదని వివరించారు. 

అమరావతి: సీఎం జగన్ ఈ రోజు మరికాసేపట్లో అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి జగనన్న విద్యా దీవెన కింద రూ. 709 కోట్ల నిధులు విడుదల చేశారు. 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లోకి ఈ నిధులు పంపించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన బటన్ క్లిక్ చేసి ఈ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా జిల్లాల కలెక్టరేట్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యా దీవెన పథకం గురించి మాట్లాడారు. దాని ప్రాముఖ్యతను మరోసారి వివరించారు.

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, చదువుతో జీవన ప్రమాణాలు మారుతాయని, చదువే అసలైన ఆస్తి అని అన్నారు. చదువుతోనే పేదల జీవితాలు మారుతాయని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో పేదరికం చదువులకు అడ్డురాకూడదని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తెచ్చామని, తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాల్లో ఇది ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాన్ని తనకు ఆ దేవుడు ఇచ్చాడని, పేదరికంలోని తన తమ్ముళ్లు, చెళ్లెల్లకు అండగా నిలబడే అవకాశం ఇచ్చాడని పేర్కొన్నారు.

చదువు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తుందని, జీవితాల్లోని అన్ని పార్శ్వాల్లోనూ మార్పు తెస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఉదాహరణకు అక్షరాస్యత అధికంగా గల సమాజంలో శిశు మరణాలు, ప్రసవ సమయంలో గర్భిణుల మరణాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయని అన్నారు. అదే నిరక్షరాస్య సమాజంలో ఈ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని వివరించారు.

సీఎం జగన్ ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు దేశవ్యాప్తంగా అంచి పేరు వస్తున్నది. ఈ పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 9,274 కోట్లు చెల్లించింది.

ఇదిలా ఉండగా, మూడో విడతగా రాష్ట్రంలోని 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ.686 కోట్ల నిధులను సీఎం జగన్ నవంబర్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పేద విద్యార్ధులు పెద్ద చదువులు చదివితేనే వారి తల రాతలు మారుతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.ప్రతి ఒక్క విద్యార్ధిని వంద శాతం గ్రాడ్యుయేట్లుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. మొదటి విడత కింద ఈ ఏడాది ఏప్రిల్ 19న, రెండో విడత కింద ఈ ఏడాది జూలై 29న మూడో విడత కింద నిధులను పంపిణీ చేశారు. మూడో విడత కింద ఇవాళ నిధులను విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో నాలుగో విడత నిధులను ఇవ్వనున్నారు.