తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుమందు బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య జగన్ ఊరేగింపుగా వెళ్లి శ్రీ వేంకటేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించారు. పంచెకట్టు, తిరునామంతో ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి గరుడ సేవలో జగన్ పాల్గొంటారు.