రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి  తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను రేపటి కేబినెట్ సమావేశంలో ప్రకటించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను తాను తప్పుబట్టనని ఆయన స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శనివారం నాడు ఉదయం వైఎస్ జగన్ సచివాలయంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సచివాలయంలోని ఆయా శాఖల హెచ్ఓడీలు, సెక్రటరీలతో జగన్ సమావేశమయ్యారు.

సీపీఎస్ రద్దుపై కూడ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.విద్యార్హతను బట్టి పర్మినెంట్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను పెంచుతామని స్పష్టం చేశారు.

అధికారులు సహకరిస్తేనే ప్రభుత్వం ప్రజల కల నెరవేరుతోందని జగన్ అభిప్రాయపడ్డారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయాలని ఆయన కోరారు. అధికారులపై తనకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని జగన్ చెప్పారు. 

మేనిఫెస్టోలోని అంశాలు అధికారులకు దిక్సూచి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతికి అస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తామని జగన్ చెప్పారు. అధికారులు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని జగన్ కోరారు.రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.

సంబంధత వార్తలు

ఊరట: చీప్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి, విప్‌లుగా చెవిరెడ్డి, పార్ధసారథి

గడికోట శ్రీకాంత్ రెడ్డికి చీప్ విప్ పదవి: సచివాలయానికి జగన్ (లైవ్ అప్‌డేట్స్)

జగన్ వైపు: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అనర్హత, నేడు మంత్రులు