అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్  మంత్రివర్గం శుక్రవారం నాడు కొలువైంది. 25 మందితో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. తొలుత ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ప్రమాణం చేశారు. చివరగా అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ మంత్రిగా ప్రమాణం చేశారు.

జగన్ మంత్రివర్గం ఈ నెల 10వ తేదీన ఉదయం జరగనుంది.కేబినెట్ ఎజెండాలో చేర్చాల్సిన అంశాలకు సంబందించిన ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపాలని సీఎస్ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

 

2019 ఎన్నికల్లో పెనుకొండ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నిక

ఎం. శంకరనారాయణతో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ 

2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ఎమ్మెల్యేగా బాషా ఎన్నిక

అంజద్ బాషా తో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్

2014, 2019 ఎన్నికల్లో ఆలూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన జయరామ్

గుమ్మనూరు జయరామ్ తో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్

డోన్ నుండి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ 

మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నారాయణస్వామి జగన్ కాళ్లకు మొక్కారు.

జీడీ నెల్లూరు నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సత్యవేడు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

కె నారాయణస్వామితో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్

పుంగనూరు నుండి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న రామచంద్రారెడ్డి

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీలేరు, పుంగనూరు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పులు దఫాలు ఎన్నిక

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్

ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసిన మేకపాటి గౌతం రెడ్డి

2014, 2019 నుండి ఆత్మకూరు నుండి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మేకపాటి గౌతం రెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్

2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు నుండి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అనిల్ కుమార్ యాదవ్ తో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్

ఇంగ్లీషులో ప్రమాణం చేసిన ఆది మూలం సురేష్

ఆదిమూలం సురేష్ తో మంత్రితో ప్రమాణం చేయించిన గవర్నర్  

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి

బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మోపిదేవి వెంకటరమణ  మంత్రిగా పనిచేశారు.

మోపిదేవి  వెంకటరమణతో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహాన్

గుంటూరు జిల్లా పత్తిపాడు నుండి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేగా ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టారు

మేకతోటి సుచరితతో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్

మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత జగన్ కాళ్లకు పాదాభివందనం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్

వెల్లంపల్లి శ్రీనివాస్ తో మంత్రిగా ప్రమాణం  చేయించిన గవర్నర్

ఆ తర్వాత వైసీపీలో చేరిన పేర్ని నాని. 2014లో ఓటమి, 2019లో విజయం

ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలో2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన నాని

పేర్నినానితో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్

2014,2019 ఎన్నికల్లో గుడివాడ నుండి వైసీపీ అభ్యర్ధిగా ఎన్నిక

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా గుడివాడ నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక

కొడాలి నానితో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్  నరసింహన్

2019లో కొవ్వూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

2012లో ఆమె వైసీపీలో చేరారు. 2014లో కొవ్వూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి

2009లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్ధిగా ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టారు. గోపాలపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు

తానేటి వనితతో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్

2013లో వైసీపీలో చేరిన రంగనాథరాజు, ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

2004లో అత్తిలి నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక

చెరుకువాడ శ్రీరంగనాథరాజుతో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్

2013లో ఆళ్ల నాని వైసీపీలో చేరారు. 2014లో ఏలూరు నుండి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా ఆయన మరోసారి అదే స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.

2004,1009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పనిచేశారు.

ఆళ్లనాని తో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో విశ్వరూప్  పనిచేశారు.

పినిపె విశ్వరూప్‌తో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహాన్

ఈ దఫా ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్‌ పనిచేశారు.

పిల్లి చంద్రబోస్‌తో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహాన్

2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా వైసీపీ అభ్యర్ధిగా విజయం  సాధించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో కన్నబాబు పీఆర్పీ అభ్యర్ధిగా అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు.

కురసాల కన్నబాబు తో ప్రమాణం చేయించిన కన్నబాబు

2014లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా ఆయన గెలిచారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు.

విశాఖ జిల్లా భీమిలి నుండి విజయం సాధించిన అవంతి శ్రీనివాస్

అవంతి శ్రీనివాస్ తో ప్రమాణం చేయించిన గవర్నర్ 

మంత్రిగా ప్రమాణం చేసిన  శ్రీవాణి జగన్ కు పాదాభివందనం చేశారు.

కురుపాం నుండి ఎన్నికైన పుష్పశ్రీవాణి

పుష్ప శ్రీవాణితో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహాన్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ మంత్రివర్గంలో కూడ బొత్సకు చోటు

విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొత్స

బొత్స సత్యనారాయణతో మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుండి కృష్ణదాస్ గెలిచారు.

ధర్మాన కృష్ణదాస్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్

మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రారంభించారు.

ప్రొటెం స్పీకర్ గా శంబంగి చిన అప్పలనాయుడుతో గవర్నర్ ప్రమాణం చేయించారు

సచివాలయానికి చేరుకొన్న గవర్నర్ నరసింహాన్

రేపు నిర్వహించే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇస్తామని జగన్ ప్రకటించారు

గేట్ వే హోటల్ నుండి గవర్నర్ నరసింహాన్  సచివాలయానికి బయలుదేరారు.

అధికారులు సహకరిస్తేనే మంచి పాలనను అందించేందుకు సాధ్యం కానుందని జగన్ అభిప్రాయపడ్డారు.

అవినీతికి దూరంగా పారదర్శక పాలనకు అధికారులు సహకరించాలని జగన్ కోరారు.

అన్ని శాఖల హెచ్‌ఓడీలు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్‌గా గడికోట శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్‌ స్కీమ్ ను రెన్యూవల్ చేస్తూ సీఎం జగన్ మూడో ఫైల్ పై సంతకం చేశారు.
అనంత ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్ర అనుమతి కోరుతూ జగన్ రెండో సంతకం చేశారు.
ఆశా వర్కర్ల వేతనాలను పెంచుతూ వైఎస్ జగన్ తన చాంబర్‌లో అడుగుపెట్టిన తర్వాత తొలి సంతకం పెట్టారు.

తన చాంబర్లో ఉన్న వైఎస్ జగన్ నిలువెత్తు ఫోటోకు సీఎం జగన్ నివాళులర్పించారు.

ముఖ్యమంత్రిగా చాంబర్లోకి అడుగుపెట్టిన జగన్‌ను పలువురు వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు  అభినందించారు.

ముఖ్యమంత్రిగా తన చాంబర్‌లో తొలి సంతకం చేసిన జగన్ కు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం స్వీట్ తీనిపించేందుకు ప్రయత్నించారు. అయితే జగన్‌ ముందుగానే సీఎస్ కు, డీజీపీ గౌతం సవాంగ్ కు స్వీట్లు తినిపించారు.

సీఎంగా తన చాంబర్‌లో తొలి సంతకం పెట్టిన వైఎస్ జగన్

తన చాంబర్‌లో వైఎస్ జగన్ పూజలు నిర్వహించారు. వేద పండితులు జగన్‌ను ఆశీర్వదించారు.

ఉదయం 8:39 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తన చాంబర్‌లో అడుగుపెట్టారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు.

నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారంగా ఉదయం 8:35 గంటలకు వైఎస్ జగన్  సచివాలయానికి చేరుకొన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుండి 8:15 గంటలకు సచివాలయానికి బయలుదేరారు.

సచివాలయానికి పక్కనే మంత్రుల ప్రమాణస్వీకార వేదికను ఏర్పాటు చేశారు. రాత్రి కురిసిన వర్షానికి కొంత ఇబ్బంది ఏర్పడింది.

 

సంబంధిత వార్తలు

ఊరట: చీప్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి, విప్‌లుగా చెవిరెడ్డి, పార్ధసారథి

గడికోట శ్రీకాంత్ రెడ్డికి చీప్ విప్ పదవి: సచివాలయానికి జగన్ (లైవ్ అప్‌డేట్స్)

జగన్ వైపు: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అనర్హత, నేడు మంత్రులు