Asianet News TeluguAsianet News Telugu

నెలకు కోటి వ్యాక్సిన్లు ఇచ్చినా వ్యాక్సినేషన్‌కి ఆరు నెలలు: సీఎం జగన్

నెలకు కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినా రాష్ట్రంలో  వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు మాసాలు పట్టే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

AP CM Jagan key comments on corona vaccination lns
Author
Guntur, First Published May 10, 2021, 6:20 PM IST

అమరావతి: నెలకు కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినా రాష్ట్రంలో  వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు మాసాలు పట్టే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏపీ సీఎం జగన్  సోమవారం నాడు  ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షలో సీఎం  కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి సగటున నెలకు 19 లక్షల కరోనా డోసులే వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 

also read:ఏపీలో కరోనా జోరు: 24 గంటల్లో 14,996 కేసులు, మొత్తం 13,02,589కి చేరిక

కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని భావించినా కరోనా వ్యాక్సిన్లు  కేంద్రం పరిధిలో  ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.  రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడినవారికి తొలుత కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన కోారు. తొలి దశ వ్యాక్సిన్ వేసుకొన్న వారికి రెండో డోస్ ను సకాలంలో వేసుకోకపోతే  వ్యాక్సిన్ వేసుకొన్నా ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు పైబడిన వారితో పాటు రెండో డోస్  కోరుకొనే వారికి  తొలుత వ్యాక్సినేషన్ ను ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలవాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios