నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్: గ్రూప్ -1,గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్ణయం
ఏపీ రాష్ట్రంలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో నిరుద్యోగులకు YS Jagan సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. Group 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.Job క్యాలెండర్ పోస్టుల కంటే అధికంగా భర్తీకి అనుమతిస్తూ సీఎం జగన్ ఇవాళ నిర్ణయం తీసుకొన్నారు.
110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిపికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేయనుంది. గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డీఎస్పీ, డీఎఫ్ఓ,మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవో పోస్టులు భర్తీకి అనుమతి ఇచ్చారు. గ్రూప్ 2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టుల భర్తీ చేయనున్నారు.
గ్రూప్ -2 పోస్టులు
1.డిప్యూటీ తహసీల్దార్ - 30 పోస్టులు
2.సబ్ రిజిస్టార్ (గ్రేడ్-2) - 16 పోస్టులు
3.అసిస్టెంట్ రిజిస్టార్ (కోపరేటివ్)- 15 పోస్టులు
4.మున్సిఫల కమిషనర్లు (గ్రేడ్-3) -5 ;పోస్టులు
5. ఏఎల్ఓ(లేబర్) -10 ;పోస్టులు
6.ఏఎల్ఓ(లేజిస్లేచర్) -4;పోస్టులు
7.ఏఎస్ఓ( జీఏడీ) -50 ;పోస్టులు
8.జేఏ(సీసీఎస్) -5;పోస్టులు
9.సీనియర్ అకౌంటెంట్( ట్రెజరీ) -10పోస్టులు
10.జూనియర్ అకౌంటెంట్( ట్రెజరీ)-20 పోస్టులు
11.సీనియర్ ఆడిటర్ (స్టేట్ ఆడిట్ శాఖ)-5 పోస్టులు
12.ఆడిటర్ (పే అకౌంట్స్ )-10 పోస్టులు
గ్రూప్ 1 పోస్టులు
1. డిప్యూటీ కలెక్టర్లు- 10 ;పోస్టులు
2. ఆర్టీఓ- 07 పోస్టులు
3.జిల్లా రిజిస్టార్(స్టాంప్స్, రిజిస్ట్రేషన్)- 06 పోస్టులు
4.జిల్లా ట్రైబల్ వేల్పేర్ ఆఫీసర్- 01 పోస్టు
5. జిల్లా సోషల్ వేల్పేర్ ఆఫీసర్- 01 పోస్టు
6.జిల్లా బీసీ వేల్పేర్ ఆఫీసర్ - 03 పోస్టులు
7.డీఎస్పీ(సివిల్)- 13 పోస్టులు
8.డీఎస్పీ(జైళ్ల శాఖ)- 02 పోస్టులు
9.జిల్లా ఫైర్ ఆఫీసర్ - 02 పోస్టులు
10.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ - 03పోస్టులు
11.మున్సిపల్ కమిషనర్- 01 పోస్టు
12.మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 2)- 08 పోస్టులు
13.డిప్యూటీ రిజిష్ట్రార్(సహకార శాఖ)- 02 పోస్టులు
14.ఏఏఓ/ఏటీఓ (టెజరీ) - 08 పోస్టులు
15.సెక్రటరీ, (ట్రెజరీ,గ్రేడ్ 2) - 05 పోస్టులు
16.ఏఏఓ (స్టేట్ ఆడిట్) - 04 పోస్టులు
17.ఏఓ( డైరెక్టర్, పీహెచ్) - 04 పోస్టులు
18.ఎంపీడీఓలు - 07 పోస్టులు