అమరావతి: ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీనే రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అదే రోజున జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కూడ ప్రారంభించనున్నారు.

మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్  పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. స్కూల్స్ తెరిచే నాటికి సర్వం సిద్దంగా ఉంచాలని  సీఎం ఆదేశించారు.నాడు–నేడులో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలన్నారు. ప్రతి స్కూల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో అందమైన వాల్‌ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని ఆయన సూచించారు. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్‌ ఉండాలని కోరారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్ ను సీఎం పరిశీలించారు. 

ఈ కిట్ తయారు చేసిన అధికారులను సీఎం అభినందించారు. నాడు–నేడు (మనబడి) మిగిలిన దశ పనులపైనా సమీక్షించారు. సకాలంలో ఆయా పనులు చేపట్టాలన్న సీఎం కోరారు. నిధులకు కొరత లేకుండా చూస్తానని సీఎం ఆదేశించారు.

వచ్చే జూన్ 30 నుంచి ఫేజ్ 3 నాడు నేడు కి శ్రీకారం చూడతామన్నారు. మొత్తం అన్ని పాఠశాలల్లో నాడు నేడు పనులు 2022 నాటికి పూర్తి చేసేలా రూపకల్పన చేయాలని సీఎం కోరారు.