Asianet News TeluguAsianet News Telugu

పశ్చిమబెంగాల్ విధ్వంసం: అమిత్ షా గూండాలపనేనన్న చంద్రబాబు

పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా మంగళవారం కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసున్నన్నారు. 
 

ap cm chandrababu naidu reacts on westbengal violence
Author
Amaravathi, First Published May 15, 2019, 3:25 PM IST

అమరావతి: పశ్చిమబెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన దాడిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పశ్చిమబెంగాల్ లో విధ్వంసం వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో భయాందోళన సృష్టించాలనే బీజేపీ బీ టీం గూండాలను రంగంలోకి దింపిందని ఆరోపించారు. 

సీబీఐ, ఈడీ, ఐటీ దాడులకు భయపడకపోవడంతో ఇక  నేరుగా దాడులకు పాల్పడుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు మాత్రమే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. 

మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగే కుట్ర అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై మండిపడ్డారు. ధర్మో రక్షిత రక్షిత: అనే సూక్తికి స్పూర్తికి విరుద్దంగా, హింస ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్ లా మోదీ- షాలను నమ్మి మోయడానికి సిద్దంగా లేదన్నారు. 

 

పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా మంగళవారం కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసున్నన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో అసలు బలం లేని బీజేపీ, మమతా బెనర్జీపై రాక్షసుల్లా విధ్వంసం సృష్టించి, అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు కల్పించి రాజకీయ పబ్బం గడుపుకుందామనే ఆలోచనలో మోదీ అమిత్ షాలు ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. వారి వికృత పాచిక పారదంటూ చంద్రబాబు హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios