ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నిర్మాత, అపర భగీరథుడు సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు.

అమరావతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కాటన్ చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాటన్‌ను ప్రజలు గుండెల్లో గుడికట్టుకుని పూజిస్తున్నారన్నారు.

కాటన్ స్ఫూర్తితోనే నీరు-ప్రగతి లాంటి జల సంరక్షణ ఉద్యమాలు ప్రారంభించామని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. జూలై నుంచి గ్రావిటీ ద్వారా పోలవరానికి నీరు అందిస్తామని తెలిపారు.

పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసి కృష్ణాడెల్టాలో కరువును తరిమికొట్టామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఐదేళ్లలో ఏపీలో 23 జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామన్నారు.