చంద్రబాబు యోగాసనాలు

AP CM Chandrababu Naidu participate international yoga day celebrations
Highlights

చంద్రబాబు యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన యోగా డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ హాలులో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలు , అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. 69 ఏళ్ల వయసులో యువకులతో పోటీ పడి మరీ అన్ని రకాల ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు గంటపాటు యోగా చేయడం వల్ల గొప్ప ప్రశాంతత లభిస్తుందని.. యోగా మన పూర్వీకులు మనకు అందజేసిన గొప్ప వారసత్వ సంపద అన్నారు..  ప్రస్తుత తరంలో నమనమంతా డబ్బు చుట్టూ పరుగులు తీస్తున్నామని.. అందువల్ల అనర్థాలు కొనితెచ్చుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.. నిత్య జీవితంలో యోగా-కుటుంబవ్యవస్థను ఒక భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని సీఎం అన్నారు.

ప్రస్తుతం శారీరక వ్యాధుల కంటే మెదడుకు సంబంధించిన వ్యాధులే మనిషిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోందని.. మెదడును, మనస్సును నియంత్రించుకోవాలంటే యోగా గొప్ప సాధనమన్నారు.. యోగా అనేది ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన అంశం కాదని.. అది అందరి సొత్తని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader