Asianet News TeluguAsianet News Telugu

రామోజీరావుతో చంద్రబాబు భేటీ: కీలక అంశాలపై చర్చ

గుంటూరు జిల్లా నుంచి హెలికాప్టర్ లో రామోజీ ఫిలింసిటీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు నాయుడుకు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ సరళి, వివిధ సంస్థలు ఇస్తున్న సర్వేలు, జాతీయ రాజకీయాలపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం.

ap cm chandrababu naidu meets eenadu group of chairman ramoji rao
Author
Hyderabad, First Published May 15, 2019, 4:06 PM IST

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుతో భేటీ కావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు బుధవారం వాటన్నింటిని రద్దు చేసుకున్నారు. 

రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం గుంటూరు జిల్లా నుంచి హెలికాప్టర్ లో రామోజీ ఫిలింసిటీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు నాయుడుకు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు స్వాగతం పలికారు. 

అనంతరం వీరిద్దరూ కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ సరళి, వివిధ సంస్థలు ఇస్తున్న సర్వేలు, జాతీయ రాజకీయాలపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం. ఇకపోతే మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈనెల 19న విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. టీడీపీని గందరగోళానికి గురి చేసేందుకే ఎగ్జిట్ పోల్స్ తో భయపెట్టాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఎట్టి పరిస్థితుల్లో టీడీపీయే అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలో పార్టీ సమీక్షలను రద్దు చేసి రామోజీరావును కలవడంపై టీడీపీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios