Asianet News TeluguAsianet News Telugu

వీవీ ప్యాట్ లన్నింటిని లెక్కించాలి: చంద్రబాబు డిమాండ్

సుప్రీం కోర్టు వీవీ ప్యాడ్ స్లిప్పుల లెక్కింపుపై పిటీషన్ ను డిస్మిస్ చేసిన తర్వాత తాము కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసినట్లు తెలిపారు. తాము అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాడ్  స్లిప్పులను లెక్కించాలని కోరినట్లు తెలిపారు. 14 టేబుల్స్ పై వీవీ ప్యాట్లను లెక్కించవచ్చునని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

ap cm chandrababu naidu comments over cec meeting
Author
Delhi, First Published May 7, 2019, 6:24 PM IST

ఢిల్లి: ఈవీఎంలపై తాము పదేళ్లుగా పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈవీఎంల పనితీరు, వీవీ ప్యాడ్ స్లిప్పులు లెక్కింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ ను చంద్రబాబు సారథ్యంలో విపక్ష నేతలు కలిశారు. 

వీవీ ప్యాడ్ స్లిప్పులు లెక్కింపు అంశంపై ఫిర్యాదు చేశారు. వీవీ ప్యాడ్ స్లిప్పులన్నింటిని లెక్కించాలని తాము కోరినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. తాము ఎన్నికల్లో పారదర్శకత కోరుకుంటున్నామని అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పారదర్శకత కోరుకోవడం లేదన్నారు. 

సుప్రీం కోర్టు వీవీ ప్యాడ్ స్లిప్పుల లెక్కింపుపై పిటీషన్ ను డిస్మిస్ చేసిన తర్వాత తాము కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసినట్లు తెలిపారు. తాము అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాడ్  స్లిప్పులను లెక్కించాలని కోరినట్లు తెలిపారు. 

14 టేబుల్స్ పై వీవీ ప్యాట్లను లెక్కించవచ్చునని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈవీఎం కౌంటింగ్ లో ఫెయిల్ అయితే వీవీ ప్యాడ్ స్లిప్పుల కౌంటింగ్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి 5 బూత్ లకు మాత్రమే వీవీ ప్యాడ్లు లెక్కిస్తామని సిఈసీ చెప్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఈవీఎం, వీవీ ప్యాడ్లు కౌంట్ చేసిన తర్వాత వెబ్ సైట్లో పెట్టాలని సూచించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై విశ్వసనీయత ఉండాలని లేని పక్షంలో ప్రజలు భవిష్యత్ లో ఓట్లేసేందుకు కూడా ముందుకు రారని తెలిపారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

సిఈసీతో ముగిసిన విపక్షాల భేటీ

Follow Us:
Download App:
  • android
  • ios