Asianet News TeluguAsianet News Telugu

నీ కుప్పిగంతులు నా దగ్గరొద్దు: జగన్‌పై బాబు వ్యాఖ్యలు

బాక్సైట్ ప్రైవేట్‌పరం చేసింది వైఎస్ హయాంలోనే అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసింది టీడీపీ మాత్రమేనన్నారు.  

AP CM chandrababu Naidu comments on YSRCP chief YS Jagan
Author
Amaravathi, First Published Feb 24, 2019, 2:12 PM IST

బాక్సైట్ ప్రైవేట్‌పరం చేసింది వైఎస్ హయాంలోనే అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసింది టీడీపీ మాత్రమేనన్నారు.  

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వచ్చే వ్యక్తిపై ఎంక్వైరీ లేదంటూ ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతిపరుల్ని కేంద్రప్రభుత్వం కాపాడుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ అభివృద్ధి చెందుతోందని కేసీఆర్‌కు భయమన్నారు.

రాష్ట్ర శాంతిభద్రతల అంశంపై కేంద్రం పెత్తనం చేస్తోందని..మోడీ, జగన్, కేసీఆర్ మనపై కుట్ర పన్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరిస్తున్నారని, దేశంలో ప్రతిపక్షనేతలపై మోడీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

రాజకీయాలను జగన్ నేరమయం చేశారని, గుంటూరులో జనసేన, నెల్లూరులో కాంగ్రెస్‌పై వైసీపీ దాడి చేసిందని, రౌడీయిజాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మనకిచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై కుల ముద్ర లేదని...కుల ముద్ర వేయడానికి ఎవరూ సాహసించలేదన్నారు. బిహార్ కన్సల్టెంట్‌ను పెట్టుకుని బీహార్ రాజకీయం చేస్తున్నారని ఏపీ సీఎం ధ్వజమెత్తారు.

బీహార్, యూపీలలో ఇలాగే చిచ్చు పెట్టారని, ఇప్పుడు ఏపీలోనూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కుప్పిగంతులు తన ముందు చెల్లవని బాబు హెచ్చరించారు.

విభజన హామీలను మోడీ అమలు చేయలేదని, విశాఖ రైల్వేజోన్ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. న్యాయం చేయమంటే కేంద్రం మనపై సీబీఐతో దాడి చేయించిందని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని...మోడీవి మాటలే కానీ చేతలు కావని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి, వైసీపీలో చేరాలని టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios