దాచేపల్లి బాధితురాలికి సీఎం పరామర్శ

ap cm chandrababau naidu at guntur government hospital to meet dachepalli victim
Highlights

గుంటూరు ప్రభుత్వాసుపత్రికి సీఎం చంద్రబాబు

గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం చేరుకున్నారు. దాచేపల్లి అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు ఆయన అక్కడకు వచ్చారు. మూడు రోజుల క్రితం  9ఏళ్ల చిన్నారిపై 53ఏళ్ల రామసుబ్బయ్య అనే వ్యక్తి  అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా..
నిందితుడు పోలీసులకు, కోర్టు, చట్టాలకు బయపడి గురజాడ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ రోజు ఉదయం చిన్నారిని ఏపీ స్పీకర్ కోడెల పరామర్శించగా.. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. సీఎం రాకతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు.

loader