నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో  సెల్‌పోన్ అత్యంత కీలకమని ఏపీ సీఐడీ అధికారులు  అభిప్రాయంతో ఉన్నారు.

 అమరావతి:నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో సెల్‌పోన్ అత్యంత కీలకమని ఏపీ సీఐడీ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వంపై , సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక ఎంపీ రఘురామకృష్ణంరాజు వెనుక ఎవరి ప్రోద్బలం ఉందా అనే కోణంలో సీఐడీ విచారణ జరపనుంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు హైద్రాబాద్‌లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో రఘురామకృష్ణంరాజు సెల్‌ఫోన్ ను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయాన్ని కోర్టులో కూడ ఎంపీ రఘురామకృష్ణంరాజు శనివారం నాడు తెలిపారు. 

also read:తాళ్లతో కట్టేసి, అరికాళ్లపై కర్రలు, ఫైబర్ లాఠీలతో కొట్టారు: రఘురామ కృష్ణమ రాజు

ఎంపీ రఘురామకృష్ణంరాజుతో ఫోన్‌లో ఎవరెవరు మాట్లాడారు, తరచుగా ఎవరు వాట్సాప్ ద్వారా చాట్ చేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజును ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసేలా ఎవరైనా రెచ్చగొట్టారా అనే కోణంలో కూడ దర్యాప్తు చేసేందుకు ఈ ఫోన్ ఉపయోగపడుతోంది. స్వతహాగానే ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారా, ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయాలను టెక్నికల్ గా నిరూపించేందుకు ఈ ఫోన్ ఉపయోగపడనుంది సీఐడీ భావిస్తోంది.