హైదరాబాద్: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఈ నెల 17వ తేదీన అమరావతికి వెళ్లనున్నారు. అమరావతిలో భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు చంద్రబాబునాయుడికి మంగళవారంనాడు హైద్రాబాద్ లో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను చంద్రబాబునాయుడు తీసుకొన్నారు.హైద్రాబాద్ లో ఉన్న సమయంలో ఏపీకి చెందిన సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. దీంతో చంద్రబాబునాయుడు ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు బాబును కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు బుధవారం నాడు అమరావతికి వెళ్లనున్నారు.సీఐడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో  న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్లాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారని సమాచారం.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబునాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో కూడ చంద్రబాబుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు కేసులు వేశారు. ఓటుకు నోటు కేసు  విషయమై ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో దేవాలయ భూముల విషయమై కూడ ఆయన కోర్టులో కేేసు వేశారు.