17 ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫారసులకే వర్తిస్తుంది: సుప్రీంలో రోహత్గీ
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. 17ఏ సెక్షన్ చుట్టూ వాదనలు కొనసాగాయి.
న్యూఢిల్లీ: 17 ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫారసులకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు.
పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ ఎల్ పీ పై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలను విన్పించారు.
అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుందని రోహత్గీ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసును జీఎస్టీ, ఆదాయపన్ను శాఖాధికారులు కూడ దర్యాప్తు చేస్తున్నారన్నారు. అంతేకాదు ఈ మేరకు ఆయా శాఖలు .
కేసులు కూడ నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ కేసు అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి.. లేదంటే క్వాష్ చేయాలని రోహత్గీ సుప్రీంకోర్టులో వాదనలు విన్పించారు.చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయని రోహత్గీ ప్రశ్నించారు.వందల కోట్లు అవినీతి జరిగినట్టు ఆరోపణలున్నప్పుడు సెక్షన్ 482 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేమని రోహత్గీ సుప్రీంకోర్టులో వాదనలు విన్పించారు.
ఇప్పుడు మనం మాట్లాడుతుంది 17 ఏ వర్తిస్తుందా లేదా అనేదే కదా జస్టిస్ అనిరుద్ద బోస్ ఈ సమయంలో రోహత్గీని ప్రశ్నించారు. కేసుల నమోదు, చార్జీషీట్, విచారణ అనేది అన్ని కేసుల్లో జరిగేది జస్టిస్ అనిరుద్దబోస్ పేర్కోన్నారు.
also read:ఇక నుండి రోజుకు ఒక్కసారే:చంద్రబాబుతో లీగల్ టీమ్ ములాఖత్ ల కుదింపు
మీరు కేసు పెట్టేనాటికి చట్టం అమల్లోకి వచ్చిందని జస్టిస్ అనిరుద్దబోస్ గుర్తు చేశారు. చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైన విషయాన్ని జస్టిస్ బోస్ ప్రస్తావించారు. ఆరోపణలపై అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా జస్టిస్ త్రివేది ప్రశ్నించారు.