ఇక నుండి రోజుకు ఒక్కసారే:చంద్రబాబుతో లీగల్ టీమ్ ములాఖత్ ల కుదింపు
చంద్రబాబును న్యాయవాదులు రోజుకు ఒక్కసారే కలిసేందుకు రాజమండ్రి జైలు అధికారులు అనుమతిస్తున్నారు. గతంలో రోజుకు రెండు దఫాలు అవకాశం ఇచ్చారు.
రాజమండ్రి: టీడీపీ చీఫ్ చంద్రబాబుతో న్యాయవాదుల బృందం ములాఖత్ లను రోజుకు ఒక్కసారికే కుదించారు జైలు అధికారులు. గతంలో రోజుకు రెండు దఫాలు న్యాయవాదుల బృందం చంద్రబాబు కలిసేందుకు అవకాశం ఉండేది. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబుకు రోజుకు ఒక్కసారే న్యాయవాదులు కలిసేందుకు జైలు అధికారులు అనుమతిని ఇచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు పలు కేసుల్లో చంద్రబాబు పేరును సీఐడీ అధికారులు చేర్చారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసులలో చంద్రబాబు పేర్లున్నాయి.
అయితే ఈ కేసులకు సంబంధించి కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే విషయమై చంద్రబాబుతో మాట్లాడేందుకు న్యాయవాదుల బృందం ప్రతి రోజూ రెండు దఫాలు కలిసేందుకు గతంలో రాజమండ్రి జైలు అధికారులు అనుమతించారు. కానీ భద్రతా కారణాలను చూపుతూ ఇక నుండి రోజుకు ఒక్కసారే న్యాయవాదులను అనుమతించనున్నారు.
also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 19కి వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.