అమరావతిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చింది.

అమరావతికి సంబంధించి మీ దగ్గర సమాచారం చెప్పాలంటూ సీఐడీ నోటీసుల్లో కోరింది. అలాగే ఆ సమచారాన్ని సీఐడీకి సమర్పించాలంటూ ఆర్కేకు విజ్ఞప్తి చేసింది.

కాగా, ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలకు సీఐడీ నోటీసులు  జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న నారాయణ, 23న చంద్రబాబు హాజరుకావాలని సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చింది. 

Also Read:

అమరావతి భూముల కేసు: మాజీ మంత్రి నారాయణ ఇళ్లలో సిఐడి సోదాలు