అమరావతి: సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా చేసిన కామెంట్లపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ  అధికారులు తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

ఐటీ చట్టంలోని 67 సెక్షన్, ఐపీసీలోని 153(A), 505(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు  బుధవారం నాడు తెలిపారు. దరిశ కిషోర్‌రెడ్డిపై సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

also read:జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు: ఎంపీ సురేష్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

సోషల్‌ మీడియాలో పోస్టులపై సాక్ష్యాధారాలతో సహా సీల్డ్‌ కవర్‌లో సీఐడీకి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పంపారు.దీంతో సీఐడీ అధికారులు కేసు పెట్టారు.  హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ  లేఖ ఆధారంగా హైకోర్టు సుమోటోగా తీసుకొంది.

హైకోర్టు జడ్జిలపై  కామెంట్ చేసిన ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సహా 49 మందికి హైకోర్టు ఈ నెల 26వ తేదీన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.