Asianet News TeluguAsianet News Telugu

రఘురామ అరెస్ట్ వెనుక కారణమిదే: ఏపీ సీఐడీ ప్రకటన

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌‌పై ఏపీ సీఐడీ అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఆయనను అరెస్ట్ చేశామని తెలిపారు.

ap cid announcement on ysrcp mp raghu rama krishnam raju arrest ksp
Author
Amaravathi, First Published May 14, 2021, 7:50 PM IST

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌‌పై ఏపీ సీఐడీ అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఆయనను అరెస్ట్ చేశామని తెలిపారు.

ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయేలా రఘురామ వ్యవహరిస్తున్నారని డీజీ అన్నారు. వర్గాల మధ్య ఘర్షణలు పెంచేలా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని మాట్లాడారని సీఐడీ ఆరోపించింది. రఘురామపై ఐపీసీ 124ఏ, 153ఏ, 505 ఆర్/డబ్ల్యూ, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది. 

మరోవైపు రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదని పిటిషన్ వేయనున్నారు. పోలీసులు నిర్బంధించి తీసుకెళ్లిన ఎంపీకి అనారోగ్య సమస్యలు వున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Also Read:వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్

కాగా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును శుక్రవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈమేరకు హైద్రాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్ నుండి ఎంపీని ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారు. 

అంతకుముందు సీఐడీ పోలీసులతో రఘురామకృష్ణమ రాజు వాగ్వివాదానికి దిగారు. సెక్యూరిటీ సిబ్బంది రఘురామ కృష్ణమ రాజు చుట్టూ వలయంగా ఏర్పడి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు అరెస్టు చేయడానికి అనుమతించబోమని వారు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios