అమరావతి: ఈ నెల 14వ తేదీన కేబినెట్ ఎజెండాలో చేర్చే అంశాలపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశం గురువారం నాడు జరిగింది.

ఈ నెల 14వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంఓ నుండి ఏపీ సీఎస్‌కు నోట్ అందింది. ఫణి తుపాన్, కరువు, తాగునీటి సమస్యపై చర్చించనున్నట్టు ఆ నోట్‌లో సీఎంఓ తేల్చి చెప్పింది.

కేబినెట్ సమావేశానికి సంబంధించి ఎజెండాను ఈసీకి పంపేందుకు స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో  సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం విడి విడిగా సమావేశమయ్యారు.

కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండాను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేయనుంది. స్క్రినింగ్ కమిటీ ఫైనల్ చేసిన ఎజెండా అంశాలను ఈసీ ముందుకు పంపనున్నారు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే  ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

మారిన చంద్రబాబు కేబినెట్ భేటీ తేదీ: ఎందుకంటే..

చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎల్వీ సుబ్రమణ్యం మెలిక

కేబినెట్ భేటీ: సాధారణంగా అయితే చంద్రబాబుదే నిర్ణయం, కానీ..

కేబినేట్ : అధికారులతో సీఎస్ అత్యవసర భేటీ

చంద్రబాబు ఆఫీస్ నుంచి నోట్: ఎల్వీ రియాక్షన్ మీదే ఉత్కంఠ

క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?