అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన ఏర్పాటు చేయాలని సీఎంఓ నుండి సీఎస్‌కు నోట్ పంపిన నేపథ్యంలో అధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం నాడు భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఏపీ సీఎస్‌కు సీఎంఓ నుండి నోట్ మంగళవారం నాడు చేరింది.

సీఎంఓ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్‌ సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో  భేటీ అయ్యారు. మంత్రివర్గం ఏర్పాటుకు సంబంధించి చర్చించారు.ఈ పరిణామాల నేపథ్యంలో  ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం  అందుబాటులో ఉన్న అధికారులతో చర్చించారు.

ఎన్నికల కోడ్ ఉన్నందున కేబినెట్ భేటీ  ఏర్పాటు విషయమై సీఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. ఫణి తుఫాన్ కారణంగా  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరువు పరిస్థితులపై చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ లో చర్చించాలని సీఎం భావిస్తున్నారని సీఎంఓ వర్గాలు సీఎస్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో కేబినెట్ భేటీ ఏర్పాటు విషయమై ఈసీకి కూడ లేఖ రాయాలని సీఎస్ భావిస్తున్నారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధికారులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

సంబంధిత వార్తలు

చంద్రబాబు ఆఫీస్ నుంచి నోట్: ఎల్వీ రియాక్షన్ మీదే ఉత్కంఠ

క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?