అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 14 వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యానికి మంగళవారం నాడు మరో నోటును సీఎంఓ పంపింది.

ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి సీఎంఓ మంగళవారం నాడు ఉదయం నోట్ పంపింది.సీఎంఓ ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్  ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో భేటీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారితో సీఎస్ భేటీ అయ్యారు.

ఎజెండా అంశాలను ఈసీకి పంపుతాం... ఈ ఎజెండా అంశాలను పంపాలని సీఎస్.. మంగళవారం మధ్యాహ్నం సీఎంఓను కోరారు. దీంతో మంగళవారం సాయంత్రం ఈ నెల 14వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎంఓ నుండి నోట్ సీఎస్‌కు చేరింది.

కేబినెట్‌లో చర్చించనున్న ఎజెండా అంశాలను కూడ సీఎస్‌‌కు పంపారు.ఎన్నికల కోడ్ కారణంగా ఈసీకి ఎజెండాను పంపాల్సి ఉన్నందున ఈ విషయమై నోట్‌లో ఎజెండాను పంపారు.

ఫణి తుపాణ్ కారణంగా చోటు చేసుకొన్న నష్టం, కరువు  పరిస్థితులు, తాగునీటి  ఎద్దడి, ఉపాధి హామీకి సంబంధించిన నిధుల విడుదల అంశాలను  ఎజెండాలో చేర్చారు.  ఈ నాలుగు అంశాలకు సంబంధించి సీఎస్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. ఆ తర్వాత ఈసీకి ఈ ఎజెండాను పంపనున్నారు.ఈసీ పచ్చజెండా ఊపితేనే కేబినెట్ సమావేశం ఉంటుంది.


సంబంధిత వార్తలు

చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎల్వీ సుబ్రమణ్యం మెలిక

కేబినెట్ భేటీ: సాధారణంగా అయితే చంద్రబాబుదే నిర్ణయం, కానీ..

కేబినేట్ : అధికారులతో సీఎస్ అత్యవసర భేటీ

చంద్రబాబు ఆఫీస్ నుంచి నోట్: ఎల్వీ రియాక్షన్ మీదే ఉత్కంఠ

క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?