Asianet News TeluguAsianet News Telugu

ఊరిస్తున్న ఆంధ్ర క్యాబినెట్

  • మంత్రి వర్గ విస్తరణ లోకేశ్  కే పరిమితం అవుతుందా
  • ఫిరాయింపు దార్లకు పదవులొస్తాయా రావా
  • టిడిపి ఎమ్మెల్యేలకు ఎన్నాళ్లీ ఎదురుచూపులు 
AP cabinet pie in the sky

’అహనా పెళ్లంట’ సినిమాలో కోటా శ్రీని వాసరావు లా వుంది  తెలుగుదేశం శాసన సభ్యలు పరిస్థితి.

బలిసినన కోడినొక దాన్ని ముందర వేళాడేసుకుని కూడి కూర  తింటున్నఅనుభూతి పొందుతుంటాడు కోటా శ్రీనివాస రావు. ఇది పిసినారికి వచ్చిన ఒక గొప్ప ఆలోచన. కానీ మన ఫ్యాంటసీని  చక్కగా పట్టేసింది. మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న   తెలుగుదేశం సభ్యల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

 

అభిమానుల ముందర, నియోజకవర్గం ప్రజల ముందర అపుడపు తాము కలిసే ఆపీసర్ల ముందర చాలా మంది శాసన సభ్యులు కోటా శ్రీనివాస రావులాగే  బతుకుతున్నారు.  ఎదురుగా క్యాబినెట్ కోడి వేళ్లాడుతూ ఉంది. అది అందకపోయినా, అందినట్లు, అనుభవిస్తున్నట్లు ఎమ్మెల్యేలంతా లొట్టలేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.  తెలుగుదేశం సభ్యులే కాదు,  ఈ మధ్య పార్టీ ఫిరాయించి పచ్చ కండువాకప్పుకున్న వైఎస్ ఆర్ సి శాసన సభ్యులు కూడా ఇలా కోటా శ్రీనివాస రావు కలలే కంటున్నారు. 

 

విజయవాడలో ఒక ముస్లిం శాసన సభ్యుడి  పార్టీ ఫిరాయింపును స్వాగతించి మాట్లాడుతూ ఈ సారి ఒక ముస్లిం సభ్యుడికి క్యాబినెట్లో చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయుడు అన్నప్పటినుంచి  ముస్లిం ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు ఇలా క్యాబినెట్ చికెన్ కూర వూహించుకుంటూ క్యాబినెట్ లో కూర్చున్న  అనుభూతి పొందుతున్నారు. దాదాపు ప్రతిజిల్లా నుంచి ఒక రిద్దరు ఇలా క్యాబినెట్ కోడి  కూర ను వూహించుకుంటున్నారు.

 

అయితే, చికెన్ కరీ ఎపుడ తయారవుతుందో ఎవరికీ తెలియడం లేదు.  మునిసిల్ ఎన్నకలయింతర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ ఆశతో పదవి కావాలనుకుంటున్న వాళ్లు, పదవి వూడుతుందేమో నని భయపడుతున్నవాళ్ల ఈ కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల్లో బాగా పనిచేస్తారని నాయకుడి నమ్మకం.

 

ఇపుడొక అపశకునపు మాట కూడా ప్రచారం అవుతూ ఉంది.  ఫిరాయింపు దారులకు చాన్స్ ఉండదేమో అంటున్నారు. వారి  విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో నని తెలుగుదేశం అధ్యక్షుడు ఎదురు చూస్తున్నాడట. ఎందుకయినా మంచిది, వాళ్లని క్యాబినెట్ కు దూరంగా పెట్టడం మంచిదని కూడా  కొంతమంది సలహా లిస్తున్నారట.

 

సుప్రీంకోర్టు  తీర్పు ఫిరాయింపులకు వ్యతిరేకంగావస్తే, నిప్పుకు మరక అంటకుండా ఉండేందుకు  వైఎస్ఆర్ సి వారిని దూరంగా ఉంచేప్రమాదం ఉంది. అలా కాకుండా కోర్టు తీర్పు  అనుకూలంగా వస్తే, అగ్రిమెంట్ ప్రకారం వైఎస్ ఆర్ సి సభ్యులకు పదవీ యోగం ఉంటుంది.

 

ఇప్పటికయితే, క్యాబినెట్ పదవి ఖాయమని తేలింది ఒక్కరికే. అది పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు. పార్తీలో చాలా బాగా పనిచేస్తున్నందున, ఆయన సేవలను  ప్రభుత్వంలో  వినియోగించుకునే విషయం ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి చెబితే, పదవి తిరస్కరిస్తే  చేతకాని వాడంటారని , అందువల్ల పదవి ఇస్తే తీసుకొనక తప్పదేమో నని  ఆయన  పుత్రుడు లోకేశ్  జరగబోయేదేమిటో తేటతెల్లం చేశారు. మిగతా వాళ్లకే గ్యారంటీ దొరకడం లేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios